కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపు చర్యలు ఉండవు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి - minister mandipalli comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 6:44 PM IST

Kadapa ZP Plenary Meeting: కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కక్షసాధింపు చర్యలు ఉండబోవని రవాణశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. కడపలో నిర్వహించిన ఉమ్మడి కడపజిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కలెక్టర్ శివశంకర్, MP అవినాష్ రెడ్డి, టీడీపీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి ధీటుగా సమాధానం చెప్పారు.  మెజారిటీ సభ్యులు వైఎస్సార్సీపీ చెందిన వారే ఉన్నప్పటికీ, ఏమాత్రం వెరవకుండా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను గుర్తు చేస్తూ, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాలను మంత్రి వివరించారు. ప్రజలకు మేలు చేసేందుకు గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేవనెత్తిన అనేక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు దాటవేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.