రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కృషిచేసే ప్రతిభావంతుల కోసం అన్వేషిస్తున్నాం: మంత్రి లోకేశ్ - INNOVATIVE IDEAS IT SECTOR DEVELOP - INNOVATIVE IDEAS IT SECTOR DEVELOP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2024, 12:15 PM IST
Minister Lokesh Encourage Innovative Ideas to Economic Development in AP : వినూత్న ఆలోచనలతో ఏపీ ఆర్థికాభివృద్ధికి కృషి చేసే ప్రతిభావంతుల కోసం తమ అన్వేషణ సాగుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. అటువంటి అభిరుచి ఉన్నవారి నుంచి సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని లోకేశ్ తెలిపారు. హైదరాబాద్లో 30 ఏళ్ల క్రితం చంద్రబాబు సృష్టించిన ఐటీ విప్లవం చరిత్ర ఆంధ్రప్రదేశ్లో తిరిగి పునరావృతం అయ్యేలా కృషి చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఓ చరిత్ర సృష్టించేలా తయారీరంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా మరోసారి తాము మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యత ప్రమాణాల పెంపు, మానవ వనరుల ప్రయోజనంపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వామి కావాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రధాన పెట్టుబడిదారులు స్నేహపూర్వక గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు కలిసి కట్టుగా కృషి చేస్తామని లోకేశ్ వెల్లడించారు.