చెర్వుగట్టు ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి - Cheruvugattu Jatara

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 12:58 PM IST

Minister KomatiReddy venkat Reddy Visit Cheruvugattu Temple : హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తుల శివనామస్మరణల మధ్య శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం కనులపండుగా సాగింది. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల నడుమ తాళి బొట్టు ధారణ, తలంబ్రాల పర్వంతో స్వామి కల్యాణం రమణీయంగా జరిగింది. చెర్వుగట్టు స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

స్వామివారికి ప్రభుత్వం తరుపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. చెర్వుగట్టు ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రానున్న మూడు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తామని మంత్రి అన్నారు. చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డుతో పాటు భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. త్వరతిగతిన జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి వెంకట్​రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.