LIVE : హైదరాబాద్​లో మంత్రి కోమటిరెడ్డి మీట్ ది ప్రెస్ - Minister Komati Reddy Live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 12:04 PM IST

Updated : May 8, 2024, 1:57 PM IST

Minister Komati Reddy Meet The Press Program Live : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. అభ్యర్థులందరూ ప్రజాక్షేత్రంలో ఓట్లభ్యర్థిస్తున్నారు. వారి తరఫున ప్రముఖ నాయకులందరూ ప్రచారం చేస్తూ ఎన్నికల హీట్​ పెంచుతున్నారు. ప్రధాన పార్టీ నాయకులందరూ జనం మధ్య తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అగ్ర నాయకులు రాష్ట్ర పర్యటన చేసి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సమావేశాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు మంత్రులు తమ నియోజకవర్గంలోని నిలబడిన అభ్యర్థిని గెలిపించాలని రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​లు నిర్వహిస్తోన్నారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి హైదరాబాద్​లో మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుబంధు, అకాల వర్షాల పంట పరిహారం ఇచ్చిందని తెలుపుతున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం త్వరలో చేయబోయే విధానాలను వివరిస్తున్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ నాయకులపై పలు విమర్శలు చేస్తున్నారు. 
Last Updated : May 8, 2024, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.