అత్యాచారం చేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు - మంత్రి పార్థసారథికి బాధితుల ఫిర్యాదు - Parthasarathy Received Requests - PARTHASARATHY RECEIVED REQUESTS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-08-2024/640-480-22098483-thumbnail-16x9-minister-pardasaradhi.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 6:50 AM IST
Minister Kolusu Parthasarathy Receiving Requests From People at NTR Bhavan : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు నిర్వహిస్తున్న ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. మంత్రి కొలుసు పార్థసారథి వారి నుంచి వినతులు స్వీకరించారు. వైఎస్సార్సీపీ నాయకుల భూ కబ్జా, అక్రమ కేసులు, బిల్లులు చెల్లించకపోవడంపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని మంత్రి వెల్లడించారు.
తమ భూమి లాక్కుని ఇబ్బంది పెడుతున్నారని ఆచంట నియోజకవర్గం వేలగలేరు గ్రామానికి చెందిన కొవ్వూరి భాస్కరరెడ్డి మంత్రి పార్థసారథికి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో ఓ మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి బంధువులు బంధించి అత్యాచారం చేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును తప్పుదారి పట్టించారని వడ్డెర సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. నేరస్థులను శిక్షించాలని వినతిపత్రం అందించారు. బాధితులను అర్జీలను సంబంధిత శాఖలకు పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గ్రీవెన్స్‌లో పాల్గొన్న నేతలు అర్జీదారులకు హామీ ఇచ్చారు.