LIVE : మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం - Minister Jupally Krishna Rao Live - MINISTER JUPALLY KRISHNA RAO LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 21, 2024, 4:08 PM IST
|Updated : May 21, 2024, 4:32 PM IST
Minister Jupally Krishna Rao Press Meet Live : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికే రూ.500 బోనస్ రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అధికారం వచ్చాక హస్తం పార్టీ మాట మర్చిందని ఆరోపిస్తున్నారు. వరి పంటకు రూ.500 బోనస్ అని ఇప్పుడేమో సన్న రకాలకేనని చెబుతోందని విమర్శిస్తున్నారు. మరి దొడ్డు వడ్ల పరిస్థితి ఏంటని మంత్రులు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం రైతులకు వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చే విషయం స్పష్టతనిస్తున్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు పరుస్తోందని తెలియజేస్తున్నారు. తడిచిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని భరోసా ఇస్తున్నారు.
Last Updated : May 21, 2024, 4:32 PM IST