గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సంధ్యారాణి - Minister Attend Tribal Ceremonies

🎬 Watch Now: Feature Video

thumbnail

Minister Gummadi Sandhya Rani Participated in Tribal Ceremonies : గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని శిశుసంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. గిరిజన ప్రజలకు విద్య, వైద్యం, సాగు, తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డోలీ మోతలు లేకుండా చూస్తామని మాటిచ్చారు. విజయనగరం జిల్లా సాలూరులో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన యువతులు, చిన్నారులు సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. వారితో కలిసి మంత్రి సంధ్యారాణి పాదం కదిపారు. 

అడవితల్లి చిత్రపటానికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఏకలవ్య పాఠశాలలో 85 మంది గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని మంత్రి అన్నారు. 31 గిరిజన గ్రామాల్లో ఉన్న త్రాగు నీటి సమస్య గురించి సీఎం చంద్రబాబు మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. గిరిజనులంతా తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. గిరిజన ప్రాంతాల్లో త్వరలోనే ఫీడర్ అంబులెన్స్​లు మంజూరు చేస్తామన్నారు. గిరిజన బిడ్డలు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.