వంశధార పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు - Minister Atchennaidu Review Meeting
🎬 Watch Now: Feature Video
Minister Atchennaidu Review Meeting With Agriculture Officials : రాష్ట్రంలో ప్రతి రైతుకూ నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులకు విత్తన కొరత ఎక్కడ ఏర్పడినా అధికారులే బాధ్యత వహించాలన్నారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందుబాటులో ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో రైతులకు సాగు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తక్షణమే వంశధార పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. సాగు నీటి కాలువల్లో పూడిక తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎత్తిపోతల పథకాల వద్ద ట్రాన్స్ఫార్మర్లు అపహరణకు గురైనా చర్యలు లేవని పోలీసులు కేసులు నమోదు చేయాలనీ అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతన్నలకు ఎటువంటి సమస్య తలెత్తినా అధికారులు వెంటనే స్పందించి సహాయపడాలని సూచించారు.