వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు - 'ప్రతీ అధికారి రైతులకు అందుబాటులో ఉండాలి' - Minister Atchennaidu Review Meeting - MINISTER ATCHENNAIDU REVIEW MEETING

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 4:04 PM IST

Minister Atchennaidu Review Meeting With Agriculture Officials : వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఆయన  నివాసంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార పాడి పరిశ్రమ శాఖల అధికారులుతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు.  ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తనాలు, ఎరువులు కొరత రాకూడదని  పంటలకు నాణ్యమైన పురుగులు మందులు అందించాలని ఆదేశించారు. ఈ నెల 18 న రైతన్నలకు అందించబోయే పీఎం కిసాన్ తదితర అంశాలపై చర్చిస్తూ ప్రతీ అధికారి రైతులకు అందుబాటులో ఉండాలని మంత్రి  సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు శుక్రవారం (14-06-2024) శాఖలు కేటాయించారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కీలక శాఖలు కట్టబెట్టారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు. శాఖల కేటాయింపులో సీనియర్లకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.