ధరల నియంత్రణపై మంత్రి అచ్చెన్న సమీక్ష- రైతు బజార్లను బలోపేతం చేయాలని ఆదేశాలు - Minister Atchannaidu review meeting - MINISTER ATCHANNAIDU REVIEW MEETING
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2024/640-480-21850016-thumbnail-16x9-minister-atchannaidu-held-review-with-officials-on-control-of-essential-prices.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 7:05 PM IST
Minister Atchannaidu held Review With officials on Control of Essential Prices : రాష్ట్రంలో నిత్యావసర ధరల నియంత్రణ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ధరలను నియంత్రణ చేయాలని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కే విధంగా రైతు బజార్లను పటిష్ట పరచాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ధరల పెరుగుదల, పంట దిగుబడి అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు.
అలాగే నిత్యావసర సరకుల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలపై వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై శాఖల అధికారులు, మంత్రులతో సమీక్ష చేశారు. బియ్యం, కందిపప్పు, టమోటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. డిమాండ్ కు సరిపడా సరఫరా లేక కంది పప్పు ధర అంతకంతకూ పెరుగుతోందని అధికారులు తెలిపారు. అలాగే టమోటా, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని వెల్లడించారు. ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.