జగన్‌కు ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలోనూ రాదు : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి - Minister Anam Comments On Jagan - MINISTER ANAM COMMENTS ON JAGAN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2024/640-480-21815656-thumbnail-16x9-minister-anam-narayana-reddy-comments-on-jagan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 12:45 PM IST
Minister Anam Narayana Reddy Comments On YS Jagan : ఐదేళ్లుగా పరదాల మాటున పాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత జగన్ అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శాసనసభ నియమాలు పాటించని వ్యక్తి, ప్రతిపక్ష హోదా కావాలని జగన్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష హోదా జగన్‌కు ఏ పరిస్థితిలోనూ రాదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాలు కట్టుకోవడం దారుణం అని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు శాసనసభ నియమాలే పాటించలేదు. జగన్మోహన్ రెడ్డి సలహాదారులు రాజ్యాంగం, చట్టాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం నియమాలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 28 ప్యాలెస్లు కట్టుకున్న వ్యక్తి అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ప్రభుత్వ నిబంధన ప్రకారమే కట్టుకుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.