త్వరలో అమరావతిలో రైతుల స్మారక చిహ్నం - ఉద్యమ విశిష్టత చాటిచెప్పేలా రూపకల్పన - Establishment of farmers memorial - ESTABLISHMENT OF FARMERS MEMORIAL

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 7:39 PM IST

Memorial to Farmers Dead in Amaravati Struggle: రాజధాని అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలకు గుర్తుగా రైతుల స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అమరావతి బహుజన జేఏసీ నాయకుడు బాలకోటయ్య తెలిపారు. అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం చేసిన 270 మంది రైతులు మరణించారని భావితరాలకు ఉద్యమ విశిష్టత చాటి చెప్పేలా స్మారకాన్ని రూపొందిస్తామన్నారు. రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను మోసగించినందుకే జగన్​ను ఘోరంగా ఓడించారన్నారు. 

రాజకీయ పెద్దల సలహాలు తీసుకొని ఈ నిర్మాణం ఎక్కడ, ఎలా జరగాలో తదితర విషయాలపై అమరావతి బహుజన కమిటీ పర్యటించి రాజధానిలోని అనుకూలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అమరావతి ఉద్యమానికి శంఖారావం ఊదిన వారిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 151 సీట్లని అహంకారంతో ఉన్న జగన్​కు కేవలం 11 సీట్లకే పరిమితం చేశామన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడం మా బాధ్యత అని బాలకోటయ్య అన్నారు. సీఎం దృష్టికి స్మారక చిహ్నం ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్తామని బాలకోటయ్య పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.