తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి - Chiranjeevi Tirumala Darshan - CHIRANJEEVI TIRUMALA DARSHAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2024, 7:32 AM IST
Megastar Chiranjeevi Visits Tirumala : సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 69వ సంవత్సర జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజన దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మెగాస్టార్ చిరంజీవిని చూసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. కాసేపు ఆలయ ప్రాంగణం సందడి వాతావరణం ఏర్పడింది. శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే తిరుమలకు చేరుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలలోనే బస చేసి, నేడు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.