అశేష జనసందోహంతో అకట్టుకుంటున్న మేడారం డ్రోన్ దృశ్యాలు - Sammakka Saralamma Jatara 2024
🎬 Watch Now: Feature Video
Published : Feb 22, 2024, 10:42 PM IST
Medaram Sammakka Saralamma Jatara 2024 : సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మార్మోగుతోంది. కోట్లాది భక్తులు తమ ఇలవేల్పైన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలు సమర్పిస్తున్నారు. జాతరకు వచ్చిన అశేష జనవాహినితో డ్రోన్ దృశ్యాలు అకట్టుకుంటున్నాయి. వేలాది భక్తులు జంపన్నవాగులో స్నానమాచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ అభయమిచ్చేందుకు సమ్మక్క తల్లి వనం నుంచి జనంలోకి రానుంది. అమ్మవారు మేడారంకి రానున్న వేళ, గద్దె వద్ద అలంకరణ పూర్తయింది. గద్దె వద్ద ముగ్గులు వేసి అలంకరించారు. చిలకలగుట్ట నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా డోలు వాద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో సమ్మక్కను ఊరేగింపుగా తీసుకురానున్నారు. గద్దె వద్దకు చేరుకోగానే ములుగు ఎస్పీ అధికారికంగా గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారికి స్వాగతం పలకనున్నారు. పల్లెలు మొదలు పట్టణాల వరకు అడుగులన్నీ మేడారం వైపే పడుతున్నాయి. రెండేళ్లకోమారు జరిగే ఆదివాసీ జన జాతరలో ప్రధాన ఘట్టం ఇవాళ ఆవిష్కృతం కానుండటంతో అశేష జనవాహినితో కీకారణ్యం కొత్త శోభను సంతరించుకుంది.