ప్రమాదకరంగా వాగు దాటే యత్నం - తృటిలో తప్పిన ప్రాణాపాయం - Man Washed Away in Vagu - MAN WASHED AWAY IN VAGU
🎬 Watch Now: Feature Video
Published : Sep 2, 2024, 7:02 PM IST
Man Washed Away in Vagu in Nizamabad : కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వాగులు ప్రమాదకరంగా మారాయి. చాలా చోట్ల కల్వర్టుల పైనుంచి వరద నీరు వేగంగా వెళ్తోంది. రోజు వెళ్లే రోడ్డే కదా అని కొందరు ప్రమాదాన్ని అంచనా వేయకుండా, పక్కనున్న వారు వారిస్తున్నా వాగులు దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రమాదానికి ఎదురెళ్లి ఓ వ్యక్తి దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు జిల్లాలోని సిరికొండ - కొండూరు మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. సిరికొండ మండల కేంద్రానికి వెళ్తున్న ఓ వ్యక్తి వాగు దాటే ప్రయత్నం చేశాడు. పక్కనున్న వారు వారిస్తున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు. మధ్యలోకి వెళ్లగానే ప్రవాహం తీవ్రతకు బైక్ అదుపు తప్పింది. అతను కిందపడి బైక్‌తో సహా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే సదరు వ్యక్తికి ఈత రావడంతో క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.