రిటైర్ బీఎస్​ఎఫ్​ జవాన్ ఇంట్లో 5లక్షల విలువైన మద్యం పట్టివేత - Retaired Jawan arrest in anantapur - RETAIRED JAWAN ARREST IN ANANTAPUR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 4:42 PM IST

Man Arrested For Retaired Jawan Selling Liquor Illegally in Anantapur: విశ్రాంత జవాన్లకు ప్రతినెలా పంపిణీ చేసే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి అధిక ధరలకు (High Price) విక్రయిస్తున్న విశ్రాంత బీఎస్​ఎఫ్ జవాను హనుమంతరెడ్డి ఇంటిపై సెబ్ (SEB) పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.5.50 లక్షల విలువైన 303 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపిస్తామని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ జి.రామకృష్ణ వెల్లడించారు.

అనంతపురం జిల్లా శిల్ప లేపాక్షి నగర్​లో నివాసిస్తున్న విశ్రాంత బీఎస్​ఎఫ్​ జవాన్​ హనుమంతరెడ్డి ప్రతినెలా బెంగళూరులోని డిఫెన్సు క్యాంటీన్ నుంచి మద్యం తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే తనకు వచ్చే ఆరు బాటిళ్ల మద్యంతో పాటు, తోటి విశ్రాంత జవాన్లకు ప్రతినెలా వస్తున్న కోటా మద్యాన్ని కొనుగోలు చేసి పెద్దఎత్తున అనంతపురం తీసుకొస్తున్నాడు. ఈ విధంగా డిఫెన్సు మద్యం ప్రతినెలా వందలాది బాటిళ్లు సేకరించి, అనంతపురం శిల్ప లేపాక్షి నగర్​లో తన ఇంట్లోనే నిల్వ చేసి విక్రయిస్తున్నాడు. గత కొంత కాలంగా నిఘా పెట్టిన సెబ్ పోలీసులు, పక్కా సమాచారంతో హనుమంతరెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.