ఇసుక దోపిడీపై త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టి- కలెక్టర్లు జాగ్రత్త!: ఎంపీ బాలశౌరీ - MP Balasouri on Illegal Sand Mining
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 11:02 AM IST
Machilipatnam MP Vallabhaneni Balasouri Comments on Illegal Sand Mining : రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై త్వరలో ఈడీతో పాటు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దృష్టి సారించనున్నాయని మచిలిపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇసుక విధానం ద్వారా ప్రభుత్వ పెద్దలకు నేరుగా ఆదాయం వస్తోందన్నారు. రాష్ట్రంలో బంగారం ధర తగ్గుతుందేమో కానీ ఇసుక ధర తగ్గదని వ్యాఖ్యానించారు.
Illegal Sand Mining in AP : ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని దీనిపై కలెక్టర్లు సమాధానం చెప్పాలని డిమాండ్ వల్లభనేని బాలశౌరి చేశారు. తమిళనాడులో అక్రమ ఇసుక తవ్వకాలపై ఈడీ తనిఖీ చేసి ఐదు మంది కలెక్టర్లపై కేసులు పెట్టారని ఇక్కడ కూడా ఆలాంటి పరిస్థితే రానుందని హెచ్చరించారు. అందుకే అధికారులు సమస్యలు కొనితెచ్చకోవద్దన్నారు. ఇసుక తవ్వకాలపై జనసైనికులు ఫొటోలు తీయటానికి వెళ్తే వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని అయితే శాటిలైట్ చిత్రాలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
పేదలకు పెత్తందారులకు పోరాటం అని చెప్పే జగన్, రీచ్‌లపై ఆధారపడిన పేదల ఆదాయానికి గండి కొట్టారని విమర్శించారు. 'నా ఎస్సీ, నా బీసీ' అనే జగన్ ఇసుక ఆదాయంలో వారికి వాటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇసుకపై వచ్చే ఆదాయం అంతా రెండు, మూడు కుటుంబాలకు మాత్రమే చెందటాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని బాలశౌరి అన్నారు.