ట్రాఫిక్‌లో లారీ బ్రేకులు ఫెయిల్- వరుసగా వాహనాలు ధ్వంసం - Lorry Accident Parawada Lankepalem - LORRY ACCIDENT PARAWADA LANKEPALEM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 7:46 PM IST
Lorry Accident in Parawada - Lankepalem National High way : పరవాడ- లంకెలపాలెం జాతీయ రహదారిపై ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాక నుంచి వస్తున్న బొగ్గు లారీ లంకెలపాలెం సిగ్నల్ పాయింట్ వచ్చే సరికి బ్రేకులు తప్పడంతో ముందున్న వాహనాలను ఢీ కొట్టింది. దీంతో వరుసగా మూడు వాహనాలు ఒక దాని వెంట మరొకటి ఢీ కొనడంతో వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకు పోవడంతో అతి కష్టమైనా పోలీసులు బయటకు తీశారు.
Road Accident : అక్కడ నుంచి అతడ్ని హాస్పిటల్ తరలించగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో వాహనాలు భారీగా స్తంభించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తీవ్రంగా దెబ్బతిన్న వాహనాలు రెండు కార్లు ఒక ట్రాక్టర్ ఒక లారీ నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసుల ఆధీనంలో ఉన్నాయన్నారు. దర్యాప్తు చేస్తున్న పరవాడ పోలీసులు ప్రమాదానికి గల కారణాలు వెల్లడించనున్నారు.