ఆ కసి నాలో ఉంది - రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా చేస్తా : లోకేశ్ - టీడీపీ నేత నారా లోకేశ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 1:14 PM IST
Lokesh Tells TDP Win The Upcoming Elections: మంగళగిరిలో అధికార వైసీపీ కనుమరుగైందని, నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రమంతా పసుపుమయం కాబోతుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు మంగళగిరిని పట్టించుకోని అధికార పార్టీ, ఇప్పుడు ఏదో ఇళ్ల పట్టాలిస్తామని హడావిడి చేస్తోందని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ నేను మంగళగిరిలో ఓడిపోయినా కసితో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని లోకేశ్ వివరించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా మంగళగిరి నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
మరో వైపు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను చేపట్టి శనివారంతో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేక్ కోసి వేడుక నిర్వహించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కటోరా దీక్షతో లోకేశ్ విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారని నేతలు పేర్కొన్నారు.