అమెరికాలో అరెస్ట్ అయింది జగనా అతని కుటుంబ సభ్యులా? లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు - YCP fake news on Nara Lokesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 6:38 PM IST
Lokesh Fires on YCP Fake News on Social Media: తనని అమెరికాలో అరెస్టు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ చేస్తున్న ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయింది జగనా లేక అతని కుటుంబ సభ్యులా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎవరు అరెస్టు అయ్యారో ప్రచారం చేస్తున్న గాడిదల్ని అడగాలని సూచించారు. అందరూ జగన్‌లా ఉండరన్నారు. మనీ లాండరింగ్‌లు, వైట్ కాలర్ నేరాలు అన్నీ జగన్ కుటుంబాలకు తెలిసిన విద్యలేనని విమర్శించారు. గత కొద్ది రోజులుగా లోకేశ్‌పై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికాలో లోకేశ్ అరెస్ట్ అయ్యారని సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టులు పెడుతున్నారు. వాటిని లోకేశ్ తిప్పికొట్టారు. హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకోగా టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మంగళగిరి నియోజకవర్గ నేతలతో నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు.