అప్పులు చేయటంలో జగన్ పీహెచ్డీ: లోకేశ్ - అప్పుల్లో జగన్ పీహెచ్డీ చేశారు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 2:54 PM IST
Lokesh Comments On Jagan Debts: ఐదేళ్లుగా జగన్ సొంత కంపెనీలు వేల కోట్ల లాభాలతో కళకళలాడితే, అడ్డగోలు అప్పులతో (Debts) రాష్ట్ర ఖజానాను దివాలా తీయించారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్డీ (PhD) చేశారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
Mineral Wealth Debt for 7000 crores: రాష్ట్ర పరిపాలనా కేంద్రం అయిన సచివాలయాన్ని (secretariat) రూ. 370 కోట్లకు తాకట్టు పెట్టిన జగన్, తాజాగా రాష్ట్రంలో ఖనిజ సంపదను తాకట్టు పెట్టి 7 వేల కోట్లు అప్పు తెచ్చారని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పటికే మందుబాబులను తనఖా పెట్టి 33 వేలకోట్లు రుణాలు జగన్ తెచ్చారని ధ్వజమెత్తారు. మీ బిడ్డనంటూ వేదికలపై ఊదరగొడుతున్న జగన్ మాటల వెనుక ఆంతర్యాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గుర్తించి ఆయనతో జాగ్రత్తగా ఉండాలని లోకేశ్ సూచించారు.