LIVE : రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చ - ప్రత్యక్షప్రసారం - Central Budget Session 2024 Live
🎬 Watch Now: Feature Video
Published : Feb 2, 2024, 11:02 AM IST
|Updated : Feb 2, 2024, 10:00 PM IST
Lok Sabha Session 2024 Live : సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆకాంక్షల మధ్య ఈ బడ్జెట్ తీసుకొచ్చింది. గతేడాది మాదిరిగా ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌నే ప్రవేశ పెట్టారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివారు. కేంద్ర ఆర్థిత మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న అంశంపై తెలిపారు. బడ్జెట్ దేశాభివృద్ధి కొనసాగింపునకు విశ్వాసం కలిగించింది. పేద, మధ్యతరగతి వర్గాలకు తాత్కాలిక బడ్జెట్ సాధికారత, యువతకు లెక్కలేనన్ని ఉపాధి అవకాశాలపై బడ్జెట్లో ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో సమయంలో ఈ బడ్జెట్ సమావేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జేట్పై విపులంగా లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనే ప్రశ్నలకు లోక్‌సభ సభ్యుల మధ్య చర్చ కొనసాగుతోంది.