LIVE: లోక్​సభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - Lok Sabha Budget Session

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 11:09 AM IST

Updated : Aug 2, 2024, 7:04 PM IST

thumbnail
Lok Sabha Budget Session LIVE : లోక్​సభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నిన్నటి సభలో బడ్జెట్​పై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌కు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌కు, మరికొన్ని వినిమయ బిల్లులకు సభ మూజువాణి ఓటుతో సమ్మతిని వెల్లడించింది. బుధవారం నాటి సమావేశాల్లో కేరళ వయనాడ్​లో జరిగిన కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై పార్లమెంట్​ వేదికగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశామని కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని ఆరోపించారు. మరోవైపు తిరిగి ఇవాళ మళ్లీ లోక్​సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Aug 2, 2024, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.