LIVE : గాంధీభవన్‌లో మంత్రి జూపల్లి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Gandhi Bhavan Live
🎬 Watch Now: Feature Video
Published : Feb 7, 2024, 3:23 PM IST
|Updated : Feb 7, 2024, 3:51 PM IST
Minister Jupally Krishna Rao LIVE : తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ సమావేశం ఇటీవల ముగిసింది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. లోక్‌సభ ఎన్నికల సీట్లకు వచ్చిన 309 దరఖాస్తుల్లో ఎవరికి ఇవ్వాలనే దానిపైనే ప్రధానంగా చర్చ సాగింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే బీఆర్ఎస్‌ను ఓడించారని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారత్ రాష్ట్ర సమితికి ప్రజలు వాత పెట్టి రెండు నెలలు కూడా కాలేదని వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికలప్పుడు గులాబీ పార్టీ చాలా హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయలేదని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి జూపల్లి ఆరోపించారు. ఇవాళ రూ.40,000ల కోట్లు వడ్డీలకే పోతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారుపళ్లెం కాదని, అప్పుల కుప్పగా ఉందని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకే బీఆర్ఎస్‌ను ఓడించారని పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.