LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌రావు ప్రెస్‌మీట్ - Raghunandan Rao Pressmeet - RAGHUNANDAN RAO PRESSMEET
🎬 Watch Now: Feature Video
Published : Apr 2, 2024, 11:26 AM IST
|Updated : Apr 2, 2024, 11:38 AM IST
BJP Leader Raghunandan Rao Press Meet : మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రాఘనందన్ రావు సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఇంక నమ్మరని ఎద్దేవా చేశారు. తాజాగా రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్‌లో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఉన్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి 2015లో ఆయన్ను అరెస్టు చేశారని తెలిపారు. మెదక్‌లో భారాసకు స్థానికులు దొరకడం లేదా? కరీంనగర్ నుంచి హరీశ్‌రావును తీసుకొచ్చి ఇక్కడ రుద్దారన్నారు. ఆయన చాలదన్నట్లు ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారు. వెంకట్రామిరెడ్డిది ఏ జిల్లా, ఏ ఊరో ఆయనకే తెలియదు. కలెక్టర్‌గా ప్రజలను దోచుకున్నారని, ఇప్పుడు ఆ డబ్బు ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఆయనకు ఇతరులను దోచుకోవడం తప్ప తెలిసిందేం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 90 రోజుల్లో రూ.9 వేల కోట్లు అప్పులు చేశారన్న రఘునందన్‌రావు, కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొందని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే భవిష్యత్తు కనిపించడంలేదన్న ఆయన, తెలంగాణలో ఆ పార్టీకి ఓట్లు పడితే నిజాంపేట చెరువులో మునిగినట్లేనని ఎద్దేవా చేశారు.
Last Updated : Apr 2, 2024, 11:38 AM IST