'మా భూమి మాకే కావాలి'- లింగంపల్లిలో దళిత రైతులు ఆందోళన - Lingampalli Villagers Protest - LINGAMPALLI VILLAGERS PROTEST

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 11:26 AM IST

Lingampalli Villagers Protest Over Land Issue : వైఎస్సార్ జల్లా సిద్ధవటం మండలం లింగంపల్లిలో దళిత రైతులు ఆందోళనకు దిగారు. కొన్ని దశాబ్దాల తరబడి తాము సాగు చేసుకుంటున్న భూమిని అగ్రవర్ణాలకు అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూముల జోలికి ఇతరులు వస్తే సహించేదని సృష్టం చేశారు.

తమ భూములు తమకు అప్పగించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని దళితులు హెచ్చరించారు. సిద్ధవటం మండలం కడపాయపల్లి గ్రామానికి చెందిన దళితులకు లింగంపల్లిలో 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాన్ని వాళ్లు 50 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భూముల విలువకు రెక్కలు వచ్చాయి. దానిపై అగ్రవర్ణాల వారి కన్నుపడింది. దాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని బాధితులు వాపోయారు. కలెక్టర్‌, ఆర్డీఓ (RDO) తమకు న్యాయం చేయాలని మహిళలు వేడుకున్నారు. ఆందోళకు దిగిన మహళలకు కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.