'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టపోయాను - కూటమికే అందరూ మద్దతివ్వాలి' - Land Titling Act Victim Protest - LAND TITLING ACT VICTIM PROTEST
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-05-2024/640-480-21433531-thumbnail-16x9-land-titling-act-victim-protest-in-kakinada.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 2:20 PM IST
Land Titling Act Victim Protest in Kakinada: ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల తాను నష్టపోయానంటూ ఓ బాధితుడు వినూత్నంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడు. కాకినాడ జిల్లా దుర్గాడ గ్రామానికి చెందిన రైతు కొమ్మూరి గంగాధర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల తాను నష్టపోయిన తీరును బ్యానర్‌పై ప్రదర్శిస్తున్నారు. చిత్రాడ గ్రామంలో పవన్ కల్యాణ్ రోడ్‌షోలో బ్యానర్ పట్టుకుని ప్రజలకు వివరిస్తున్నారు. రీసర్వే చేస్తే 15 సెంట్లు తక్కువ చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని వాపోయారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్న కూటమికే మద్దతివ్వాలని ప్రజలను కోరుతున్నారు.
భూ యాజమాన్య హక్కుల చట్టం (ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2023)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ చట్టం అమలులోకి వస్తే భూమి పై హక్కు కోల్పోతామనే భయంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ విధానం వల్ల నేను నష్టపోయానని ఓ రైతు ఆవేదన చెందుతున్నారు.