యథేచ్ఛగా భూకబ్జా - ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకో అని బెదిరింపు - LAND ENCROACHMENT IN YSR DISTRICT - LAND ENCROACHMENT IN YSR DISTRICT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 12:42 PM IST
Land Encroachment in YSR District: రాష్ట్రంలో భూ ఆక్రమణలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. దీని కారణంగా అనేక మంది సామాన్య ప్రజలు రోడ్డున పడుతున్నారు. భూ ఆక్రమణలపై ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయమై న్యాయం కోసం అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండటం లేదంటూ బాధితులు వాపోతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజాగా వైఎస్సార్ జిల్లా కమలాపురంలో పుష్పరాజు అనే వ్యక్తి తన 50 సెంట్ల భూమిని బాలచంద్రారెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారని ఆరోపించారు. బినామీల పేరుతో తన భూమిని రాజుపాలెంకు చెందిన వ్యక్తి కబ్జా చేశారని పుష్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి సంబంధించిన పట్టా పుస్తకాలు చూపించి ప్రశ్నిస్తే, నీకు దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరిస్తున్నారన్నారు. తమ భూమికి తమకు ఇప్పించాలంటూ 6 నెలలుగా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోయారు. అధికారులు స్పందించి కబ్జాదారుల నుంచి తన భూమి తనకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.