ట్రెడిషనల్ బాటలో రామన్న- గౌడసంఘం ప్రతినిధులతో గడను పైకి ఎత్తిన కేటీఆర్ - ktr on parliament elections
🎬 Watch Now: Feature Video


Published : Mar 4, 2024, 3:58 PM IST
KTR Cultural Steps at BRS Bhavan : భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) గౌడ సామాజిక వర్గ నేతలతో కలిసి సంప్రదాయ నృత్య స్టెప్పులు వేశారు. సిరిసిల్ల జిల్లా నారాయణపురంలో శ్రీజమదగ్ని రేణుకామాత కళ్యాణానికి, గౌడ సంఘం ప్రతినిధులు కేటీఆర్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయనకు సంప్రదాయబద్దంగా ఆహ్వానం పలికారు. అమ్మవారికి పూజలు చేసి గౌడసంఘం ప్రతినిధులతో గడను పైకి ఎత్తి కేటీఆర్ నృత్యం చేశారు.
BRS Parliament Elections Preparatory Meet : మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికతో పాటు, లోక్‌సభ ఎన్నికలపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చ జరిగింది. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలపై పార్టీ అధినేత కేసీఆర్ రేపు సమావేశం కానున్నారు.