ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన - Prakasam Barrage - PRAKASAM BARRAGE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-08-2024/640-480-22146852-thumbnail-16x9-prakasam-barrage.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 7, 2024, 3:14 PM IST
Krishna River Flood Flowing to Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. రైవస్, బందరు కాల్వలు కెఈబీ కెనాల ద్వారా 13,477 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం కొనసాగుతుండంతో పర్యాటకులు తరలివస్తున్నారు.
ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 1,01,767 క్యూసెక్కులు ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో కృష్ణానది పరీవాహక వాసులు, లంకగ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీటిలో ఈతకెళ్లడం, చేపలు పట్టడం, నాటుపడవలో ప్రయాణించ వద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్లును ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.