గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పట్టు కోల్పోయింది : మంత్రి కొండా సురేఖ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 12, 2024, 6:58 PM IST
Konda Surekha Meeting at Gajwel : లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల్లో భ్రమను సృష్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గ్రౌండ్ లెవెల్లో కమలం పార్టీ పట్టు కోల్పోయిందని ఎద్దేవా చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు.
Konda Surekha Comments on BRS : గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించేలా పోరాడాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. కార్యకర్తలు లేకుంటే నాయకులు లేరని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం సోషల్ మీడియా కారణమని తెలిపారు. అందులో ఆ పార్టీ నాయకులు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు చూసే తగిన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన పథకాలన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.