సినీ పరిశ్రమలోని నిరుపేద కార్మికులకు నానక్‌రాంగూడలో ఇళ్ల నిర్మాణం : మంత్రి కోమటిరెడ్డి - Anchor Suma Komati Reddy
🎬 Watch Now: Feature Video
Published : Feb 19, 2024, 6:51 PM IST
Komati Reddy Speech at Free Eye Camp : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు విద్య, వైద్యంలో అధిక ప్రాధాన్యత ఇస్తోందని సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం పేదలకు వైద్యం విషయంలో విఫలమైందని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఉచిత ఐ క్యాంప్‌ను మంత్రి కోమటిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి 10 రోజుల పాటు జరిగే ఈ క్యాంపులో వందలాది మందికి ఉచిత కంటి చికత్సలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Minister Komati Reddy Venkat Reddy : ఐ క్యాంపులో వైద్య సాయం పొందుతున్న వారికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున సహాయాన్ని అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. నానక్‌రాంగూడలో ఉన్న ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం అడ్డుకుందని, అక్కడ సినీ పరిశ్రమలోని నిరుపేద కార్మికులకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ వ్యవస్థాపకురాలు సుమను అభినందించారు.