వైెెఎస్సార్సీపీ పాలనపై ప్రజలు పూర్తిగా విసిగెత్తిపోయారు : కొలికపూడి శ్రీనివాసరావు - Kolikapudi Srinivasa Rao Campaign - KOLIKAPUDI SRINIVASA RAO CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 6:50 PM IST

Kolikapudi Srinivasa Rao Election Campaign in Tiruvuru Constituency : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరువూరు నియోజకవర్గంలో మూత్రపిండాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. తాము వచ్చాక అన్ని గిరిజన గ్రామాలకు కృష్ణా జలాలను అందిస్తామని తెలిపారు. అలాగే ప్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉందని, వైఎస్సార్సీపీ పాలనపై ప్రజలు పూర్తిగా విసిగెత్తిపోయారని కొలికిపూడి అభిప్రాయపడ్డారు.

కూటమి తరపున సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజల్లో ఆదరణ బాగుందన్నారు. వైసీపీ హాయాంలో ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి పథకాన్ని వర్తింపజేశారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంతమంది పిల్లులున్నా తల్లికి వందనం పథకం అమలు చేస్తామిని హామీ ఇచ్చారు. జగన్ పథకాల డొల్లతనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అన్నివర్గాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని తలిపారు. సమస్యలపైన పోరాడుతున్న తనకు ప్రజలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని కొలికిపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.