LIVE : భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి - Kishan Pujas Bhagyalakshmi Temple
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-02-2024/640-480-20784695-thumbnail-16x9-kishan-reddy-live-in-hyderabad.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 19, 2024, 11:10 AM IST
Kishan Reddy Live : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజక వర్గాలను చుట్టేసేలా కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది. ఆ ఐదు క్లస్టర్లలో మొత్తం 4238 కిలోమీటర్ల మేర రథయాత్రలు సాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. విజయ సంకల్పయాత్రకి రాష్ట్ర ప్రముఖులు నేతృత్వం వహించనున్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రతిపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రలతో ప్రజలకు వివరించనున్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు అన్ని ఏర్పాట్లు చేసింది. నేడు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బీజేపీ ప్రచార రథాలను ప్రారంభిస్తున్నారు.