రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది : కిషన్​ రెడ్డి - Kishan Reddy Meet With Dwcra Groups

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 3:36 PM IST

Kishan Reddy Chit Chat With Dwcra Groups : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా తెలంగాణ ప్రజల పాలిట గారడీలుగా మారనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి విమర్శించారు. హామీల అమలుకు చేసే అప్పులతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేటలో కేంద్రమంత్రి డ్వాక్రా మహిళా సంఘాలతో కిషన్ రెడ్డి ముఖాముఖీగా పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం మహిళలకు సీట్లు వస్తాయని, రాజకీయంగా నారీమణులు ఎదగాలనే మోదీ రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఉజ్వల యోజన పథకం కింద పేదలకు మోదీ ఉచితంగా గ్యాస్ ఇచ్చారని వివరించారు. పొదుపు సంఘాలకు ప్రతి ఊరికి మోదీ డ్రోన్లు పంపించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ద ప్రతిపాదికన పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

BJP MP Candidates Selection Process : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. అయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యవసర సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణలు చేస్తోంది. ఇందులో భాగంగా నేడు, రేపు పార్టీ మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలకు ఆహ్వానాలు పంపి రప్పించుకుని నేతలు భేటీ అవుతున్నారు. రాష్ట్ర నేతలు పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే అంశంపై అభిప్రాయ సేకరిస్తున్నారు. రాష్ట్ర పదాధికారుల బృందం పార్లమెంట్‌ వారిగా అభిప్రాయాలు సేకరించే పనిలో పడ్డారు. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణకు నేతలు వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.