thumbnail

హైదరాబాద్​లో ఫార్మా సూటికల్​​ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తా : కిషన్​ రెడ్డి - Kishan Reddy On Pharma Sector

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 9:57 PM IST

Kishan Reddy On Pharma Sector : కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇప్పటివరకు దేశంలో లేని  ఫార్మాసూటికల్​​ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌ ప్రాంతానికి యూనివర్సిటీని తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన 73వ ఇండియన్‌ ఫార్మాసూటికల్​​ కాంగ్రెస్‌ ఎక్స్‌పో కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

ఫార్మాస్యూటికల్​ రంగంలో దేశంలోనే హైదరాబాద్​ నగరం ముందుందని కిషన్​రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్​లకు సంబంధించి ​ప్రపంచానికే హైదరాబాద్ 60 శాతం కంటే ఎక్కువగా సరఫరా చేస్తుందని తెలిపారు. మారుతున్న జీవన విధానంలో అనేక రకాల కొత్త వ్యాధులు వస్తున్న తరుణంలో పరిశోధన అభివృద్ధికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఈ రంగం ద్వారా విదేశ మారకద్రవ్య నిల్వలు పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత్ ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ఈ  సదస్సులో ఐపీసీఏ ఛైర్మన్‌ పార్థసారథిరెడ్డి సహా పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు, ఫార్మా శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫార్మాసూటికల్​ కాంగ్రెస్​ సదస్సు ద్వారా దాదాపు 2 వేల మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పార్థసారథిరెడ్డి వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.