కిచెన్​లోకి 12 అడుగుల కింగ్​ కోబ్రా- తీవ్రంగా శ్రమించి పట్టుకున్న క్యాచర్​- లైవ్​ వీడియో - King Cobra In Kitchen - KING COBRA IN KITCHEN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 12:25 PM IST

King Cobra In Kitchen at Karnataka : 12 అడుగుల కింగ్ కోబ్రా ఓ ఇంట్లోని వంటగదిలోకి ప్రవేశించి కలకలం సృష్టించింది. భయంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన కర్ణాటకలోని జరిగింది.  

చిక్కమగళూరు జిల్లాలోని శెట్టికొప్ప గ్రామానికి చెందిన మంజూనాథ్​ గౌడ​, ఉదయం స్నానం చేయడానికి వెళ్లేందుకు ఇంటి వెనుక తలుపులు తెరిచాడు. ఇంతలో కింగ్ కోబ్రా లోపలికి ప్రవేశించి వంటగదిలోకి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే మంజునాథ్, స్నేక్ క్యాచర్ హరీంద్రకు ఫోన్​ చేసి సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్​ క్యాచర్, దాదాపు గంటపాటు శ్రమించి కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం కోబ్రాను సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టాడు.  

పాముతో కుక్క ఫైట్ - ప్రాణాలకు తెగించి యజమానిని కాపాడిన 'డైసీ'
ఇటీవలే ఇంట్లోకి వచ్చిన పాముతో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడింది ఓ శునకం. తన యజమానిని పెను ప్రమాదం నుంచి తప్పించింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలో జరిగింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.