పోర్టు పునరావాస ప్యాకేజీ కోసం గ్రామస్థుల ధర్నా- వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం - పోర్టు పునరావాస ప్యాకేజీ కోసం ధర్నా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 12:07 PM IST
Karlapalem Villagers Dharna in Port Rehabilitation Package: నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు పునరావాస ప్యాకేజీ కోసం కర్లపాలెం గ్రామస్థులు చేస్తున్న ధర్నాకు వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. గురువారం అసెంబ్లీ సమావేశాల నుంచి నేరుగా పోర్టు వద్దకు వెళ్లిన మహీధర్ రెడ్డి నిర్వాసితులను కలిశారు. పునరావాసం కల్పించకుండా పోర్టు పనులు ఎలా చేస్తున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డ మహీధర్ రెడ్డి పోర్టు కార్యాలయానికి తాళాలు వేయించారు.
అనంతరం ఎండీ ప్రతాప్ కుమార్ రెడ్డితో నిర్వాసితుల ప్యాక్యేజీ గురించి ఫోన్ మాట్లాడారు. పునరావాస ప్యాకేజీ క్రింద 450 కుటుంబాలకు సహాయం అందించాల్సి ఉన్నా ఇప్పటి వరకు వారికి ఇంటి నివేశన స్థలాలను అధికారులు చూపలేదని మండిపడ్డారు. కర్లపాలెం గ్రామస్థులు గత 4 రోజులుగా పోర్టు వద్ద ధర్నా చేస్తున్నారు. నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకుంటే పనులను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. నిర్వాసితులకు మద్దతుగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, చాపల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.