LIVE : కడియం శ్రీహరి మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Kadiyam Srihari Press Meet - KADIYAM SRIHARI PRESS MEET
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-04-2024/640-480-21126317-thumbnail-16x9-kadiyam.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 2, 2024, 11:16 AM IST
|Updated : Apr 2, 2024, 11:46 AM IST
Kadiyam Srihari Press Meet : బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూమార్తే విజయంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తన కుమార్తె కావ్యతో కలిసి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన అనుచరులతో కడియం సమావేశం నిర్వహించారు.కాంగ్రెస్ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారని, తన కుమార్తెకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పారని అన్నారు. రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పినట్లు కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు తన నిర్ణయాన్ని గౌరవించాలని, తన కుమార్తెను ఆశీర్వదించాలని కోరారు. నేటి సాయంత్రం తన నిర్ణయం ప్రకటిస్తాని కడియం శ్రీహరి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై కడియం శ్రీహరి హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Last Updated : Apr 2, 2024, 11:46 AM IST