అంజద్ బాషా సోదరులు పశ్చాత్తాప పడక తప్పదు- మాధవీరెడ్డి హెచ్చరిక - kadapa TDP Candidate - KADAPA TDP CANDIDATE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2024, 5:25 PM IST
Attacks in Kadapa : కడప నగరంలో అల్లర్లు సృష్టించడానికి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరులు రాత్రి తమ కార్యకర్తలపై చేసిన రాళ్లదాడికి పశ్చాత్తాపం పడలాల్సిన పరిస్థితి వస్తుందని కడప టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. గౌస్ నగర్ లో సాయంత్రం 6 గంటలు దాటినా మిగిలిపోయిన ఓట్లను రిగ్గింగ్ చేసుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయత్నించారని, అడ్డుకోవడానికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలపై అంజద్ బాషా సోదరులు, వారి అనుచరులు రాళ్లదాడి చేశారని తెలిపారు.
తాను పోలింగ్ బూత్‌లో ఉంటే మహిళ అని చూడకుండా అంజాద్ బాషా సోదరులు మగాడు ఎవడైనా ఉన్నాడా అనే విధంగా రెచ్చగొడుతున్నారని మాధవీరెడ్డి అన్నారు. మహిళలంటే వారికి గౌరవం లేదని, వారి వ్యవహారశైలిని ప్రజలంతా గమనించాలన్నారు. అంజాద్ బాషా వాహనం పైకెక్కి మీసాలు మెలేసి, తొడలు కొట్టి కేకలు వేయడం వల్ల కడప ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తోందని, అంజాద్ బాషా సోదరులు ఊరు వదలడం ఖాయం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు.