పవన్ కల్యాణ్‌పై సూర్యప్రకాష్ విమర్శలు చేయటం తగదు: పంతం నానాజీ - Kakinada District
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 3, 2024, 4:12 PM IST
Pantham Nanaji Comments on Suryaprakash in Kakinada District : హరి రామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయటంపై పార్టీ పీఏసీ సభ్యుడు పంతం నానాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వలాభం కోసం పార్టీ మారిన సూర్యప్రకాష్ తనకు పవన్‌కల్యాణ్ సమయం ఇవ్వలేదనటం హ్యాస్యాస్పదమన్నారు. పార్టీ మారిన సూర్యప్రకాష్ ఐదేళ్లుగా జనసేన పార్టీలో ఉండి చేసేందేమి లేదని విమర్శించారు.
ఇంకేమన్నారంటే.. జనసేన పార్టీని వీడి వైసీపీలోకి చేరిన సూర్యప్రకాష్ తమ నాయకుడుపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని పంతం నానాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జససేన సభల్లో తనకు తగిన సమయం ఇవ్వలేదని అన్న మాటలు అవాస్తవమని తెలియజేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారారని ఆరోపించారు. పార్టీ సమావేశంలో చర్చికున్న విషయాలను బయట ప్రస్తావించడకూడదన్న ఇంగిత జ్ఞానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యప్రకాశ్ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టాలేదని పేర్కొన్నారు.