వైసీపీకి షాక్​ - గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర క్రిస్టినా రాజీనామా - Kattera Christina Resigns YSRCP - KATTERA CHRISTINA RESIGNS YSRCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 7:19 PM IST

Guntur ZP Chairperson Kattera Christina Resigns YSRCP : గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి షాక్​ తగిలింది. గుంటూరు జడ్పీ ఛైర్​పర్సన్ కత్తెర క్రిస్టినా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా ఆమె వైఎస్సార్సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త కత్తెర సురేష్ కుమార్ ఏడాదిగా తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జ్​గా పని చేశారు. టికెట్ వస్తుందని ఆశించిన ఆయనకు వైఎస్సార్సీపీ నిరాశను మిగిల్చింది. తాడికొండకు అభ్యర్ధిగా ఎమ్మెల్యే సుచరితను ప్రకటించడంతో వైఎస్సార్సీపీ పై అసంతృప్తితో దంపతులు పార్టీ వీడారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్నారు.    

2014 ఎన్నికల్లో క్రిస్టినా తాడికొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో అధిష్టానం శ్రీదేవికి అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టినాకు సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్​ పర్సన్‌గా నియమించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలుపొందిన క్రిస్టినాను జడ్పీచైర్ పర్సన్‌గా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.