జేఎన్‌టీయూలో కొత్త కోర్సులు - ఒకేసారి రెండు, మూడో కోర్సులు నేర్చుకోవచ్చు - JNTU Vice Chancellor Interview - JNTU VICE CHANCELLOR INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Apr 27, 2024, 5:14 PM IST
JNTU VC Katta Narasimha Reddy Interview : ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందాలంటే నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం చాలా అవసరం. ఇంజినీరింగ్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో పరిశ్రమలకు సరైన నైపుణ్యాలు లేవంటూ ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు లేక, కోర్సులు పేరుతో సమయాన్ని గడిపే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు వారి స్కిల్స్ పెంచుకునేందుకు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయని విద్యానిపుణులు తెలుపుతున్నారు.
Hyderabad JNTU VC Interview : చాలా విశ్వవిద్యాలయాలు విప్లవాత్మక కోర్సులకు శ్రీకారం చుడుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ జేఎన్‌టీయూలో కూడా విద్యార్థులకు అవసరమైన ఇండస్ట్రీస్ కోర్సులను అందిస్తున్నారు. జేఎన్టీయూలో విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సులను ప్రవేశ పెట్టామని వైస్ ఛాన్సలర్ కట్టా నర్సింహా రెడ్డి తెలిపారు. మరి, వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి? ఎలాంటి కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు? వాటి ద్వారా ఉద్యోగాలను పొందడం ఎలా? అనే అంశాలపై జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్ కట్టా నర్సింహా రెడ్డితో మాటల్లో తెలుసుకుందాం.