ప్రత్యేక హోదా సాధనకు ఇదే చక్కని అవకాశం - బడ్జెట్ను అడ్డుకోవాలి : జేడీ - విభజన హామీల సాధన సమితి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 7:44 PM IST
JD Laxmi Narayana on Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, ముగించబడిన అధ్యాయమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ప్రధాన కార్యదర్శి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ ఎంపీలు మరోసారి కేంద్రాన్ని, ప్రత్యేక హోదాపై ప్రశ్నించాలని సాధన సమితి నేతలు జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాస్ అన్నారు.
ప్రత్యేక హోదా విభజన హామీల కోసం రాష్ట్రంలోని ఎంపీలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు కాబట్టి, ప్రత్యేక హోదా సాధనకు ఇదో అవకాశమని సూచించారు. ప్రత్యేక హోదా సాధించేందుకు వచ్చిన అనేక అవకాశాలను, వైఎస్సార్సీపీ, టీడీపీ ఏనాడూ వాడుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక హోదా రావాలనే ఆకాంక్ష ఉందని సాధన సమితి నేతలు అన్నారు.