లద్దాఖ్ ఆర్మీ విన్యాసాల్లో కృష్ణా జిల్లాకు చెందిన జవాన్ నాగరాజు మృతి - Jawan Died in Ladakh Accident - JAWAN DIED IN LADAKH ACCIDENT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 4:09 PM IST
Jawan Died in Accident During Ladakh Army Exercises: లద్దాఖ్ ఆర్మీ విన్యాసాల్లో జరిగిన ప్రమాదంలో కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన జవాన్ సాదరబోయిన నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. జవాన్ నాగరాజు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో జవాన్ నాగరాజు మృతి చెందడంతో చేవెండ్ర గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశ సేవకై ప్రాణాలను అర్పించిన జవాన్ నాగరాజుకి గ్రామస్థులు నివాళులర్పించారు. సోమవారం చేవెండ్ర గ్రామానికి జవాన్ నాగరాజు మృతదేహం రానుంది. 8 సంవత్సరాల నుంచి 52 ఆర్మెంట్ రెజ్మెంట్లో అతను పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
అదే విధంగా శనివారం లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన యుద్ధ ట్యాంకు ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే. దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలో జరిగిన ఘటనలో ఒక జూనియర్ అధికారితో సహా ఐదుగురు సైనికులు మృతి చెందారు. సైనిక విన్యాసాల్లో భాగంగా నది దాటుతుండగా వరదలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్ మునిగిపోయింది. దీంతో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఐదుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు.