ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసమే నేరాలు చేశా - పీతల మూర్తియాదవ్‌కు హేమంత్ లేఖ - Murthy Yadav on MVV Satyanarayana - MURTHY YADAV ON MVV SATYANARAYANA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 5:57 PM IST
Janasena Murthy Yadav on MVV Satyanarayana: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసమే నేరాలు చేశానని పేర్కొంటూ రౌడిషీటర్ హేమంత్ తనకు లేఖ రాసినట్లు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ వెల్లడించారు. తాను చేసిన నేరాలు, భూకబ్జాలు, సెటిల్మెంట్లను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హేమంత్ ఆ లేఖలో పొందుపర్చారని పీతల తెలిపారు. దీని ద్వారా హేమంత్‌కు దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. హేమంత్ రాసిన లేఖలోని అంశాలను మూర్తియాదవ్ మీడియాకు వెల్లడించారు. వారు చేసిన నేరాల గురించి సైతం హేమంత్ లేఖలో రాశారని పీతల పేర్కొన్నారు.
ఓ అజ్ఞాత వ్యక్తి ద్వారా హేమంత్ రాసిన లేఖ తనకు అందిందని మూర్తి యాదవ్ చెప్పారు. ఎంవీవీ చేసిన అరాచకాలను పూస గుచ్చినట్లు లేఖలో ఉన్నాయని, ఎంవీవీ, జీవీలతో సహా అనిల్ రెడ్డి, జవహర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలు హేమంత్‌ను అడ్డం పెట్టుకుని అక్రమాలు చేయించారని మూర్తి యాదవ్ తెలిపారు. హేమంత్‌తో అక్రమాలు చేయించినందుకు వారంతా 500 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను అతనికి ఇచ్చినట్లు లేఖలో తెలిపారని పీతల మూర్తి యాదవ్ వివరించారు.