మంత్రిగా పవన్ ప్రమాణం- 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్న నేతలు - JSP Leaders in Kodandarama Temple
🎬 Watch Now: Feature Video
Janasena Leaders Visit Kodandarama Temple in Ippatam: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచి మంత్రిగా ప్రమాణం చేయడంతో గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండ రామాలయంలో స్వామివారికి పొంగళ్లు సమర్పించి 1001 కొబ్బరికాయలు కొట్టి గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఏ టీడీపీ సమన్వయ కర్త కోమటి జయరాం, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్థులతో కలిసి కొబ్బరికాయలు కొట్టారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహాయమైనా అందించడానికి ఎన్నారైలు సిద్ధంగా ఉన్నారని కోమటి జయరాం చెప్పారు. ప్రజలందరికీ మంచి పాలన అందిస్తామని జనసేన పార్టీ నేతలు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ రీతిలో కక్షపూరిత చర్యలకు తాము పాల్పడమని నేతలు స్పష్టం చేశారు. గెలుపు అహంకారాన్ని నెత్తికెక్కించుకుంటే వైఎస్సార్సీపీకి ఇచ్చిన తీర్పే ప్రజలు తమకు ఇస్తారని నేతలు స్పష్టం చేశారు.