నాదెండ్ల సవాల్‌ను స్వీకరించే దమ్ము జగన్‌కు ఉందా?: పోతిన మహేష్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 12:54 PM IST
Janasena Leader Pothina Mahesh Challenge : రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సవాల్‌ను స్వీకరించే దమ్ము సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy), ఆ పార్టీ నాయకులకి లేదని జనసేన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేష్ ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజలు డబ్బులు లేక అల్లాడుతుంటే వారి నెత్తి మీద 21 వేల కోట్ల రూపాయలు అదనపు పన్ను భారం వేసిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి ఆయన నిప్పులు చెరిగారు. అప్పులు చేసి 91 వేల కోట్ల రూపాయలు సీఎం జగన్ కొట్టేశారని ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో సమాధానం చెప్పాలని, నాదెండ్ల మనోహర్ విసిరిన సవాల్‌ను స్వీకరించే దమ్ముందా? అని ప్రశ్నించారు.
CM Jagan On AP Debts : వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెళ్లిపోయారని, దీంతో స్థానిక ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు ఆనందపడ్డారని పోతిన మహేష్ అన్నారు. నియోజకవర్గంలో ఒక్కరు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అనుకూలంగా స్పందించలేదని తెలిపారు.