మెగా డీఎస్సీ పేరుతో వైఎస్సార్సీపీ యువతను మోసం చేస్తోంది: నాగబాబు - Nagababu accused CM Cheated
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 7:08 PM IST
Janasena Leader Nagababu accused CM Jagan: మెగా డీఎస్సీ పేరిట వైఎస్సార్సీపీ సర్కార్ యువతను నిలువునా మోసం చేసిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25 వేల నుంచి 30 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం 6100 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. ఎన్నికల వేళ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికే ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా నిరుద్యోగులపై జగన్ సర్కార్ కు ప్రేమ ఉంటే ఖాళీగా ఉన్న 30వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
జగన్ గత పాదయాత్రలో, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో నాగబాబు మాట్లాడారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ చేసిన మోసాన్ని డీఎస్సీ అభ్యర్థులు నాగబాబు కి వివరించారు. తమ సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. జగన్ పాదయాత్ర సమయంలో 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చారని, నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారని దుయ్యబట్టారు.