సలహాదార్లకు లక్షల్లో- పనిచేసేవారికి రూ.5వేలా! జగన్ వాడకాన్ని వాలటీర్లు గుర్తించాలి: నాదెండ్ల మనోహార్ - Janasena leader Nadendla Manohar
🎬 Watch Now: Feature Video
Janasena leader Nadendla Manohar: పెన్షన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. సీఎం జగన్ కు పరిపాలనపై ఏ మాత్రం అవగాహన లేదని విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ కార్యాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్ల పై వైసీపీ ప్రభుత్వం కావాలనే రాద్ధాంతం చేస్తోందని నాదెండ్ల విమర్శించారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందని, ఈ విషయం సీఎం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడు పెన్షన్లు ఇవ్వనట్లు వీళ్లే పంచుతున్నట్లు గొప్పలకు పోతున్నారని నాదెండ్ల ఎద్దేవా చేశారు. సలహాదారుల జీతాలకు 680 కోట్లు ఖ్చర్చు పెట్టిన ప్రభుత్వం, వాలంటీర్లకు మాత్రం కేవలం 5వేలే ఇస్తుందని విమర్శించారు. ఈ విషయం వాలంటీర్లు గుర్తించాలని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదిన తెనాలిలో పవన్ కల్యాణ్ పర్యటన ఉంటుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యకర్తలు పాల్గొనాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.